– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-తల్లాడ
సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని ఆదరించండి అంటూ తల్లాడలో సోమవారం రాత్రి సత్తుపల్లి నియోజకవర్గం బిఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ప్రచారం నిర్వహించారు. శాసనసభ్యునిగా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. తెలంగాణ రాకముందు ఇన్ని పథకాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఆర్. వీర మోహన్‌రెడ్డి, డి.వెంకట్ లాల్, డి.భద్రరాజు, జివిఆర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో సండ్ర
కల్లూరు: ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం పనిచేసే నన్ను గెలిపించండి అని బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సోమవారం క్రాస్ రోడ్ నుండి చుండ్రుపట్ల రోడ్డు వరకు ప్రతి ఇంటికి, షాపులకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జడ్పిటిసి కట్టా అజరుకుమార్, బీఆర్‌ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతు సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, డిసిసిబి డైరెక్టర్ బోబొలు లక్ష్మణరావు, పెడకంటి రామకృష్ణ, మేకల కృష్ణ, కొరకప్పు ప్రసాద్, సిహెచ్ కిరణ్, శీలం సత్యనారాయణరెడ్డి, పుసులూరు శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
లింగగూడెంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
పెనుబల్లి : పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్ పార్టీలోకి పలువురు చేరారు. ఇటీవల లింగగూడెం గ్రామ టిఆర్‌ఎస్ నాయకుడు చీకటి రామారావు తుమ్మల ఆదేశాల మేరకు కాంగ్రెసులో చేరారు. తిరిగి చీకటి రామారావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్‌లోకి చేరడంతో సండ్ర వెంకట వీరయ్య సోమవారం ఆ గ్రామానికి వచ్చి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పిటిసి చెక్కిలాల మోహన్‌రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, కనగాల వెంకట్రావు, కనగాల సురేష్‌బాబు, తుమ్మలపల్లి లక్ష్మణరావు, వడ్లమూడి కృష్ణయ్య, అప్పయ్య, ఏటుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి రమేష్, తెల్లం సురేష్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లోకి పలు కుటుంబాలు చేరిక
కల్లూరు : మండలంలోని పెద్ద కోరుకొండి గ్రామానికి చెందిన పలువురు ముస్లిం యువకులు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జడ్పిటిసి కట్టా అజరు కుమార్, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు పాలెపు రామారావు తదితరులు పాల్గొన్నారు.