కాంగ్రెస్‌తోనే సకల జనుల సంక్షేమం

– కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి,
– టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌
– కడ్తాల్‌ మండలంలోని పలు గ్రామాల్లో తాండాల్లో కసిరెడ్డి విస్తృత ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్‌
కాంగ్రెస్‌తోనే సకల జనులకు సమన్యాయం సాధ్యమవుతుందని కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్‌ నాయకులు కడ్తాల్‌ మండలంలోని గోవిందాయిపల్లి, కర్కల్‌ పహాడ్‌, కోశ్యగుండు, వంకరాయి, గోవిందాయిపల్లి, నార్ల కుంట తాండాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథులుగా అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. రెండు పర్యాయాలు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి అప్పుల తెలంగాణగా చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇండ్లు తదితర హామీలను తుంగలో తొక్కి పూటకో పథకంతో ప్రజలను మభ్యపెడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకుల కుట్ర పూరిత వాగ్దానాలను ప్రజలు తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ కు మద్దతుగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రుణం తీర్చుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆమనగల్‌ కడ్తాల్‌ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సబావత్‌ బిచ్యా నాయక్‌, తెల్గమల్ల జగన్‌, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్‌, నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య, వస్పుల మానయ్య, చీమర్ల అర్జున్‌ రెడ్డి, కృష్ణ నాయక్‌, అలీం, ఖాదర్‌, కాలే మల్లయ్య, నాసర్‌, వస్పుల శ్రీకాంత్‌, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.