అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

‘శుభోదయం’ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, ఎర్రోనికొటాల గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో గ్రామపంచాయతీ పరిధిలో డ్రయినేజీ, సిమెంటు రోడ్లు ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం దశలవారీగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, సర్పంచ్‌ మల్గారి మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రాధిక, ఎంపీటీసీ రవీందర్‌, సత్యనారాయణచారి, బీఆర్‌ఎస్‌ సీని యర్‌ నాయకులు కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు ప్రభాకర్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మహేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ అబ్దుల్‌ ఘని, డ్వాక్వా గ్రూప్‌ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.