– స్టాంపీడ్ కాపిటల్ ఆమోదం
న్యూఢిల్లీ: డబ్ల్యుఇఎక్స్‌ఎల్ ఎడ్యు ప్రయి వేటు లిమిటెడ్ వ్యాపారాన్ని పునర్నిర్మించడానికి, విలీనం, కొనుగోలు చేయడానికి స్టాంపీడ్ క్యాపిటల్ లిమిటెడ్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇందుకోసం డబ్ల్యుఇఎక్స్‌ఎల్ ఈక్విటీ విలువను నిర్ణయించడానికి పిడబ్ల్యుసిసి బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్‌ను నియమించుకున్నట్లు స్టాంపీడ్ కాపిటల్ వెల్లడించింది. డబ్ల్యుఇఎక్స్‌ఎల్ ఈక్విటీ విలువ రూ.91 కోట్ల నుంచి రూ.101 కోట్ల వర కు ఉంటుందని పిడబ్ల్యుసి తన నివేదికలో అంచనా వేసిందని పేర్కొంది. ఒక్కొక్క షేర్ రూ.1 విలువ కలిగిన 10.60 లక్షల ఈక్విటీ షేర్ల కేటాయిం పును పూర్తి చేసి, రూ.1.48 కోట్ల విలువైన అంటే.. ఒక్కో షేరుకు రూ.14 చొప్పున డిఫరెన్షియల్ ఓటింగ్ హక్కులను కంపెనీ కల్పించినట్లు తెలిపింది.