రాష్ట్రంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఒరిగిందేమిటి..?

– కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష విడనాడాలి
– సింగరేణి కాంట్రాక్టు కార్మికుల
సంఘం రాష్ట్ర నాయకులు డి.వీరన్న
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉధ్యమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమవేతనాలను కోల్పోయి పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమిలేదని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు డి.వీరన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జెబిసిసిఐలో చేసిన నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయించాల్సిన కేంద్ర ప్రభుత్వం, బొగ్గు మంత్రిత్వశాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్వవరిస్తున్నాయని, ఫలితంగా కాంట్రాక్టు కార్మికుల జీవితాలలో, జీతాలలో ఎలాంటి మార్పు రావడంలేదన్నారు. వారిసమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. సింగరేణి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు తమఖాతాలో వేసుకున్నాయి. ఎంఎల్‌ఎలు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టు కార్మికులశ్రమతో అధికారులకు అవార్డులు వస్తున్నాయి. రకరకాల ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా అదికారులకు, పర్మినెంట్‌ కార్మికులకు స్వీట్లు పంచుతున్నారు. కానీ, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు స్వీటు కూడా ఇవ్వకుండా వివక్షత పాటిస్తుందని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం స్పందించాలని సిఐటియు డిమాండ్‌ చేసింది. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంచుట, సమస్యలు పరిష్కరించుట గురించి 2018లో ఎన్నికల సందర్భంగా రామగుండంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెటిఆర్‌ ఇచ్చిన హామీ, సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వావనికి సిఐటియూ బహిరంగ లేఖ రాసిందని తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో నేడు సుమారు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిలో, సింగరేణి సాధిస్తున్న లాభాలలో, సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్‌ కార్మికుల శ్రమ, రక్తం వున్నాయని చెప్పారు. కోల్‌ ఇండియాలో కాంట్రాక్ట్‌ కార్మికుడికి రోజుకు రూ.1,042లు చెల్లిస్తూంటే సింగరేణిలో రూ.494లు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి కాంట్రాక్ట్‌ కార్మికుడు నెలకు సుమారు రూ.15600లు నష్టపోతున్నాడు. ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్‌ కార్మికులకు కోల్‌ ఇండియాలో చెల్లించిన విధంగా రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని, సింగరేణిలో లాభాల వాటా లేదా చట్ట ప్రకారం 20 శాతం బోనస్‌ చెల్లించాలని, 26 సెప్టెంబర్‌2022న సింగరేణి యాజమాన్యం చేసిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలని, సింగరేణి హాస్పిటల్స్‌లో కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పిం చాలన్నారు. ఖాళీ క్వార్టర్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటా యించాలి. జాతీయ పండుగ. ఆర్జిత సెలవులు అమ లు చేయాలి. క్యాటగిరీ ఆధారంగా వేతనాలు చెల్లిం చాలి.పెండింగ్‌లో ఉన్న అన్ని విభాగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాని డిమాండ్‌ చేశారు.