ఉపాధి చట్టానికి ‘హామీ’ ఏది?

What is the 'Guarantee' of the Employment Act?– డిమాండ్‌ అధికం..
-. కేటాయింపులు స్వల్పం
– తగ్గుతున్న పని దినాలు
– అరకొర వేతనాలతో తప్పని అవస్థలు

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు కల్పించాల్సిందిగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తున్నది. మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టానికి కేటాయింపులను కుది స్తోంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు సరైన ఉపాధి పొందలేక అర్థాకలితో జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఈ చట్టం కింద సంవత్సరానికి కనీసం 100 రోజుల పని కల్పించాల్సి ఉండగా గత సంవత్సరంలో సగటున కేవలం 48 రోజుల పని మాత్రమే కల్పించారు. వాస్తవానికి గత కొన్ని సంవత్స రాలుగా సగటున ఒక్కో కుటుంబానికి యాభై రోజుల పని మాత్రమే దొరుకు తోంది. అటు వేతనాలు కూడా అరకొర గానే లభిస్తున్నాయి. గత సంవత్సరం రోజుకు సగటున రూ. 217. 91 వేతనం దక్కగా అంతకుముందు సంవత్సరం కేవలం రూ.208.84 మాత్రమే లభించిం ది. దీనిని బట్టి చూస్తే మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని నీరు కారుస్తు న్నదని అర్థమవుతుంది. ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ ఈ చట్టమే ప్రధాన జీవనాధారం గా కన్పిస్తోంది.

కోవిడ్‌లో పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోల్పోయిన ప్రజలు
పెద్ద ఎత్తున గ్రామాల బాట పట్టి ఉపాధి హామీ చట్టం లో చేరారు. ఆ సమ యంలో ఉపాధి పనుల కోసం ఏ స్థాయిలో డిమాండ్‌ ఉన్నదో గడచిన జూలై నెలలో కూడా దాదాపు అదే స్థాయిలో డిమాండ్‌ నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలలలో … అంటే ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో ఈ పథకం కింద 9.84 కోట్ల కుటుంబాలు ఉపాధి పొందాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 10% అధికం. 2021లో కోవిడ్‌ రెండో వేవ్‌ ముగిసిన తర్వాత ఈ పథకంలో లబ్దిదారులుగా ఉన్న కుటుంబాల సంఖ్య 9.97 కోట్లు.
మరింత ఆదాయం కోసం…
వ్యవసాయ పనులలో అయినా, వ్యవసాయేతర పనులలో అయినా, స్వయం ఉపాధిలో అయినా ఆదాయం తక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ చట్టం కింద పనులు చేసుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామీణ కార్మికులకు వాస్తవ వేతనాలు స్థిరంగా ఉండటమో లేదా తగ్గడమో జరుగుతోంది. ఓ సర్వే ప్రకారం దేశంలోని 36.5 కోట్ల మంది కార్మికులలో 61.5% మంది వ్యవసాయంలోనూ, 20% మంది పరిశ్రమలోనూ, 18.5% మంది సేవల రంగంలోనూ ఉపాధి పొందు తున్నారు. 2020 ఏప్రిల్‌-2021 మార్చి మధ్యకాలంలో దేశంలోని 55% కుటుంబాలు వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందాయి. రోజువారీ వేతనాలపై 24% మంది పని చేశారు.
గ్రామీణ కుటుంబాలలో నెలవారీ వేతనాలపై పని చేసింది కేవలం 13% మాత్రమే. స్వయం ఉపాధి పొందిన గ్రామీణ పురుషుల నెలసరి ఆదాయం సగటున రూ.10,228 ఉండగా మహిళలకు అందులో సగం కూడా లభించలేదు. పట్టణ ప్రాంతాలలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆదాయం తక్కువగా ఉండడంతో దానిని పెంచుకునేందుకు ప్రజలు వేర్వేరు పనులు చేస్తున్నారు. అందులో ఉపాధి హామీ చట్టం పనులు ఒకటి.
అరకొర కేటాయింపులే
ఒకవైపు ఉపాధి హామీ పనుల కోసం డిమాండ్‌ పెరుగుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని బలోపేతం చేయడానికి, మరింత విస్తరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కేటాయింపులు పెరిగితే లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగి, ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. కానీ నయా ఉదారవాద సరళీకరణ విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం ఇలాంటి పథకాలకు సాధ్యమైనంత తక్కువ నిధులు కేటాయిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిం చేందుకు తోడ్పడుతోంది. బడ్జెట్‌ అంచనాలలో అవసరమైన దాని కంటే తక్కువ మొత్తాన్ని కేటాయిస్తూ ఈ పథకం దానంతట అదే నీరుగారిపోయేలా చేస్తోంది.
ప్రభుత్వ కేటాయింపులపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పందిస్తూ బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే సవరించిన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని వివరణ ఇచ్చింది. అయితే 2023-24లో తాము రూ.98 వేల కోట్ల కేటాయింపులను ప్రతిపాదిస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ దానిని రూ.60 వేల కోట్లకు కుదించిందని చెప్పింది. ఈ సమాధానంతో పార్లమెంటరీ కమిటీ సంతృప్తి చెందలేదు. ఇది రొటీన్‌ సమాధానమేనని పెదవి విరిచింది. ఈ కేటాయింపులు నిరుపేదలైన గ్రామీణ కార్మికులకు ఏ మాత్రం ఊరట ఇవ్వబోవని తెలిపింది.
డిమాండ్‌కు కారణమేమిటి?
ఉపాధి చట్టానికి ఎందుకు ఇంత డిమాండ్‌ ఉంటోంది? ప్రధాన కారణం ఏమంటే మన ఆర్థిక వ్యవస్థ దేశ జనాభాకు చాలినంత ఉపాధి చూపలేకపోతోంది. గత కొన్ని సంవత్సరా లుగా దేశంలో నిరుద్యోగ రేటు 7-9 శాతంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి వనరుగా ఉన్నప్పటికీ అది సీజన్‌ను బట్టి మారు తుంటుంది. ఉదాహరణకు వ్యవసాయ పనులు దొరకని వేసవిలో ఉపాధి చట్టానికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటోంది. రబీ పంటలు కోసిన తర్వాత వేసవి వస్తుంది. అప్పుడు వ్యవసాయ పనులకు విరామం లభిస్తుంది. జూన్‌లో వర్షాలు పడడం ప్రారంభమైన తర్వాత ఖరీఫ్‌ సీజన్‌ వస్తుంది. ఆ సమయంలో ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతుంటాయి. అప్పుడు ఉపాధి హామీ చట్టంలో లబ్ది పొందే వారి సంఖ్య తగ్గిపోతుంది. ున్స్‌ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మద్దతు తెలిపి మాట్లాడారు.ములుగు జిల్లా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు, డీఎంహెచ్‌ఓకు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో మహేష్‌బాబుకు వినతి పత్రం అందించారు.