రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ తొలుగ భావించారు. అయితే ఆ విడుదల తేదీకి ముందుగానే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ లుక్ అందర్నీ అలరిస్తోంది. ఇందులో శ్రీలీల రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది.
రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం: ఎస్‌ఎస్ తమన్, డివోపీ: సంతోష్ డిటాకే, ఎడిటింగ్: తమ్మిరాజు.