ఆత్మహత్యలే
చేజిక్కిన ఓటమిని భరించలేక
దు:ఖాలు అసంపూర్తి వాక్యాలై
ఆఖరి తీరం ఒడ్డున
కలవరం కంగారు పెట్టే
ఆకస్మిక ఆలోచన గొడుగు కింద
పట్టపగలే సమస్యతో సతమతమవుతూ
సవాళ్లను ఎదిరించి నిష్క్రమణ వైపు కదిలింది
ఊహల సమూహమే బలహీనతతో కృంగిపోయే
నిజనిర్ధారణ నిర్ణయాలవైపు సవాళ్లనూ ఎదిరించే
ఎన్నో అవరోధాలు తలపడుతూ కదలాలి
పరిపక్వత పదునైన ఆలోచనలే
కలుపు మొక్కలుగా విలసిల్లుతాయి
కుతంత్రాలను విముక్తి చేసే
భవిష్యత్తు అంతా చెదలు పట్టిన
బకాసురుడు గుండెలకెత్తుకున్నాడు
తాపత్రయాలు సమాధానాలు లేవు
అర్థం కోల్పోయిన ఒకానొక సందర్భంలో
రెట్టించిన రేచీకటి నడుమ అన్ని అపోహలే
కనుమరుగయ్యే ప్రయోజనం చెదారనివ్వదు
అంతరార్థమ్ దాటాల్సినప్పుడు
ఓడమీద కూర్చొని ఊడిగం చేస్తూ
వర్తమానంవైపు కలలనూ బేరిజువేస్తుంది
సంకల్పమే విశ్వాసాన్ని కోల్పోతూ
నిశ్చలం వైపు ఊతమిచ్చే
నిర్వీర్యం వెంపర్లాడుతుంది
తాత్కాలికమో తెలియని సందిగ్ధం
ఇవతల వైపు ఎంతకాలం ఏమో
ఎడమ నుంచి కుడికి తీసేస్తుంది
పోగొట్టుకొని వెతికేలోపు
నిరాశ సునామిలా వస్తుంది
చేదు అనుభూతి మారుతున్న వ్యంగస్త్రం
అంతరార్థ పరిహార్ధాలన్ని షోభిల్లుతాయి
విలువలు వ్యక్తిత్వాలు చేజారుతున్న
బ్రతుకు మూలాలు అంతరార్థం దాటాల్సిందే
పోగొట్టుకున్న అంగుళం ఆకునీడ అంతరార్థ వాక్యాలే
– బూర్గు గోపికృష్ణ, 7995892410