విద్యాభివృద్ధిపై చిత్తశుద్ధి లేని విద్యా దినోత్సవాలు ఎందుకు..?

– టీజేఏసీ జిల్లా చైర్మన్‌ ముకుంద నాగేశ్వర్‌
నవతెలంగాణ-దోమ
రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న పాలకులు సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేయకపోవడం బాధాకరమైన విషయమని టీజేఏసీ జిల్లా చైర్మన్‌ ముకుంద నాగేశ్వర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిగిలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో కనీస వసతుల కల్పన, నూతన భవన నిర్మాణం ఎప్పుడూ పూర్తి చేస్తారని తెలిపారు. ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలు లేని పూడూరు, కుల్కచర్ల, దౌల్తా బాద్‌, యాలాల్‌, బషీరాబాద్‌, ఇతర మండలాల్లో జూ నియర్‌ కళాశాలలలు, బాలికల జూనియర్‌ కళాశా లలు ఇంకెప్పుడు చేస్తారనీ పేర్కొన్నారు. జిల్లాలో నూ తన నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయము, ప్రభుత్వ జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల, మహిళా గిరిజన, ఎస్సీ, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పా టు ఎప్పుడని ప్రశ్నించారు. నూతన గురుకు లాలు ఏర్పాటు చేశామని గొప్ప గా అంటున్న ప్రభుత్వం అద్దె భవనాల్లో గురుకులాల నిర్వహణ ఇంకెన్నా ళ్లు శాశ్వత భవనాలు ఇం కెప్పుడు కట్టిస్తారని, అనం తగిరి ఆయుష్‌ సెంటర్‌ పనులు ఎప్పుడు ప్రారంభి స్తారని అడిగారు. పాలకులు కళ్లు తెరిచి విద్యాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలనీ లేని పక్షంలో ప్రజలు తగిన సమయంలో సరియైన బుద్ధి చెప్పటం ఖాయమని తెలిపారు.