వీసీ, ఈసీల మధ్య యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు బలవ్వాలి..

– ప్రభుత్వం జోక్యం చేసుకొని యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలి..
– ఎ‌స్ ఎఫ్ ఐ డిమాండ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పాలకమండలిల మధ్య యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు బలవ్వాలని, వేంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని ఎ‌స్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో వివాద స్పందంగా ఉన్న వ్యక్తులను రిజిస్ట్రార్ గా నియమించడం వల్ల మళ్ళీ గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నయని, దీనివల్ల యూనివర్సిటీ లో విద్య బోధన చేస్తున్న విద్యార్థులు తివ్రంగా నష్టపోతున్నారని అన్నారు. యూనివర్సిటిలో మేస్ బంద్ అవ్వడంతో విద్యార్థులు రోడ్డు ఎక్కల్సి వచ్చిందని, ఇదే కాకుండా ఇంటింటికి తిరుగుతూ అన్నం కోసం బిక్షాటన చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. యూనివర్సిటీ లో ఉన్న  ప్రొఫెసర్ల రాజకీయాలు పక్కనపెట్టి విద్యార్థులకు చదువులు చెప్పే రకంగా ప్రభుత్వమే జోక్యం చేసుకొని బాసర త్రిబుల్ ఐటీ తరహాలో ఇంచార్జ్ వీసీని నియమించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వీరి పైన చట్టపరంగా కమిటీ వేసి విచారణ జరిపించి వారి పైన చర్యలు తీసుకునే రకంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అదేవిధంగా అభివృద్ధి దిశగా ఉండాల్సి నటువంటి ఈసీ పాలకమండలి ద్వారానే ఈ గందరగోల వాతావరం జరుగుతున్నట్టు విద్యార్థులలో చర్చని అంశంగా మారిందని అన్నారు. నవీన్ మిట్టల్, వైస్ ఛాన్సలర్ రాజకీయాలకు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా గాలికి వదిలి రూసా నిధులు కొన్ని కోట్లు దుర్వినియోగం చేసేందుకే తమకు అనుకూలంగా ఉన్న రిజిస్ట్రార్ ను నెగ్గించు కోవాలనే మొండి పట్టులో విద్యార్థులకు సెలవులు ఇవ్వడం, జీతాలు అపి మేస్ బంద్ అయ్యేవిధంగా విద్యార్ధులు రోడ్డు ఎక్కేందుకు దోహదం కు కారకులయ్యారని ఆరోపించారు. అందుకే ఈ భాగోతానికి తెర లేపారని చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు.
తక్షణమే విద్యార్థులకు హెల్త్ సెంటర్ ఓపెన్ చేసి హెల్త్ సెంటర్లో కావాల్సినటువంటి మెడిసిన్ ని అందుబాటులో ఉండే విధంగా చూడాలని దీనితోపాటు వీధిలైట్లు గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ ల వద్ద లైట్లు సరిగా లేకపోవడం వల్ల విషసర్పలు వస్తున్నాయని, దీంతోపాటు యూనివర్సిటీలో విద్యార్థులకు ఏదైనా అవసరం ఉంటే డిచ్ పల్లి మండల కేంద్రం వేళ్ళల్సి వస్తుందని దీనివల్ల విద్యార్థులు తివ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. క్యాంపస్ లో క్యాంటీన్, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని దీంతోపాటు బస్, స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఎటువంటి వివాదం లేని వ్యక్తిని రిజిస్ట్రార్ గా నియమించడం కోసం ప్రభుత్వమే చొర తీసుకొని యూనివర్సిటీ ప్రశాంతంగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో విద్యార్థులు అందరూ పాదయాత్రగా సెక్రెటేరియట్ రావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు సంధ్య, ప్రసాద్, దినేష్, శత్రు ,సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.