విస్తృతంగా సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ-నేలకొండపల్లి
పాలేరు అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండల వ్యాప్తంగా పార్టీ గ్రామ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, అవకాశవాద రాజకీయాలను తిప్పి కొడుతూ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న సిపిఐ(ఎం) అభ్యర్థులను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పగిడికత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేడు పాలేరు, ఖమ్మం సిపిఎం అభ్యర్థులు తమ్మినేని వీరభద్రం, ఎర్ర శ్రీకాంత్‌ నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహారావు, రాసాల కనకయ్య, దుగ్గి వెంకటేశ్వర్లు, మారుతి కొండలరావు, కట్టెకోల వెంకన్న, ఎడ్ల తిరుపతిరావు, డేగల వెంకటేశ్వరరావు, బండి రామ్మూర్తి, గాదే వెంకటేశ్వర్లు, గురజాల వెంకటేశ్వర్లు, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.