అంతుచిక్కని వ్యాధితో…

– 5 రోజుల్లో 40 మేకలు మృతి
– అయోమయంలో పెంపకం దారు
నవతెలంగాణ-  వెంకటాపురం
ఉదయం మంచిగానే తిరుగుతున్న మేకలు సాయంత్రానికల్లా మృతి చెందుతున్నాయి.గత 5 రోజుల్లోనే 40 మేకలు తమ కళ్ల ముందే..మృతి చెందడం తో పెంపకం దారు లబోదిబోమంటున్నారు. మేకలకు సోకినవ్యాది కనిపెట్టి కాపాడాలని పశువైద్యులను వేడుకుంటున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ఎస్.రమేష్ రచపల్లి పంచాయితీ లో గత కొన్ని సంవత్సరాలుగా మేకలను పెంచుకొంటున్నాడు. గత 5 రోజులు గా మూగజీవాలకు వింత వ్యాధి సోకి మృతి చెందుతున్నాయి.ఉదయం ఆరోగ్యం గా మేతకు వెళ్లిన మూగజీవాలు సాయంత్రం మొకo వాలిపోయి కనిపిస్తున్నాయి.పొట్ట కొంచం ఉబ్బుగా ఉండి ఉదయానికి కళ్ల మరనిస్తున్నాయి అంటూ వాపోతున్నారు. మొదటి రోజు కొన్నే మేకలు చనిపోవడంతో స్థానిక పశువుల వైద్యులను సంప్రదించి గా పశువైద్య శాలలో ఎటువంటి మందులు అందుబాటులో లేవని చెప్పారు. దాంతో భద్రచలం నుంచి ప్రయివేట్ మందుల దుకాణాల్లో మందులు తెప్పించి వాడిన ఫలితం లేనట్లు తెలిపారు.గత 5 రోజుల్లో 40 మేకలు మృత్యువాత పడినట్లు వివరించారు. బుధవారం సంచార పశువైద్యాది కారినికి తన మేకల మృత్యువాత పై తెలిపనన్నారు.ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేవని తెలపడంతో ఏటూరునాగారంలో ప్రయివేట్ మందుల దుకాణంలో మందులు తెచ్చుకోవడం జరిగిందన్నారు. తమ కళ్ళముందే తానూ పెంచుకున్న మేకలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం పై పశు వైద్యాధికారి ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా వైద్యురాలు అందుబాటులో లేరు.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మేకలకు సోకిన వ్యాధిని గుర్తించి వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.