– హోంమంత్రి సమాధానం ఆశ్చర్యకరంగా ఉంది
– ఇది రాజ్యాంగ విలువలకు మహాప్రమాదం
– ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం: బీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రుద్దేశంతోనే ఢిల్లీ బిల్లు తీసుకొచ్చారని బీఆర్‌ఎస్ రాజ్యసభ నేత కె.కేశవరావు విమర్శించారు. తాను సీబీఐ, ఈడీ వంటి క్రిమినల్ చట్టం గురించి మాట్లాడటం లేదని, రాజ్యాంగ చట్టం గురించి మాట్లాడుతున్నానని అన్నారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ తరపున కేశవరావు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని, తాను ఏ పార్టీలో ఉన్నా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో వివరణాత్మకంగా చర్చ జరిగిందని, కానీ కేంద్ర హోం మంత్రి సమాధానం మాత్రం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తాము ఇండియా కూటమిలో భాగం కాదని, అయితే దేశం ప్రమాదంలో ఉంటే (సరిహదుల్లోలా) శత్రువుకు వ్యతిరేకంగా అందరం ఐక్యం అవుతామని అన్నారు. ఇప్పుడు మా శత్రువు రాజ్యాంగాన్ని హననం చేస్తుందని, కనుక దానికి వ్యతిరేకంగా ఉన్నామని తెలిపారు. ఇది రాజ్యాంగ అంశమని, రాజకీయ అంశం కాదని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, మరికొన్ని రోజులు వేచి చూడాలని అన్నారు. ఈ బిల్లు చాలా తీవ్రమైనది కనుక ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఎవరైనా అవినీతి చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ రాజ్యాంగం జోలికెందుకు వస్తారని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన కూడా తరువాత, సుప్రీం కోర్టు చివరి రోజున కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. చట్ట శాసన కర్తలుగా చర్చించి మంచి బిల్లును ఆమోదించి, నష్టం చేసే బిల్లులను పక్కన పెట్టేయాలని అన్నారు.
రాజ్యాంగ విలువలు లేకపోతే ఇంకెందుకని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రి, ప్రభుత్వం మొత్తం అధికారాలను బ్యూరోక్రసీకి ఇవ్వడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటారని, బ్యూరోక్రాట్లు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండరని అన్నారు. అసలుసిసలైన ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రసీకి స్థానం లేదని, ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తుందని అన్నారు. ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.