చలికాలం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం మొదలైపోయింది. ఇలాంటి సందర్భాల్లో చర్మానికి సంబంధించిన జాగ్రత్తలపై దృష్టి సారించాలి.
చర్మ ఉత్పత్తులను ఉపయోగించండి
చలికాలంలో చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా లేకుండా చూసుకోవాలంటే…. సరైన చర్మ ఉత్పత్తులను ఉపయోగించాలి. వీటివల్ల చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు. అయితే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు.. లోషన్స్, మాయిశ్చరైజర్స్ వినియోగించ కూడదు. అవి వాడడం వల్ల.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మం పగుళ్ళకు దారి తీస్తుంది. అందుకే సరైన చర్మ ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వాడాలి:
సాధారణంగా చలికాలంలో మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా చర్మం పొడిబారి మొత్తం పగులుతుంది. అలాంటి సమయంలో ఎండల నుంచి రక్షణతో పాటు చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ వాడాలి. ఇవి వాడడం వల్ల ఎండల నుంచి చర్మాన్ని రక్షించుకోవడంతో పాటు.. చర్మం తేమతో ఉంటుంది.
గోరువెచ్చని నీటిని ఉపయోగించండి:
సాధారణంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళల్లో ఉండే అధిక వేడి.. చర్మంలోని తేమనంతా పీల్చేసి, చర్మాన్ని పొడిబారుస్తుంది. ఇలాంటి సమయాల్లో చర్మం పొడి బారకుండా ఉండేందుకు.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం.
సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం:
మనందరికీ తెలుసు.. పండ్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయని. దీంతో వైద్యులు సైతం పండ్లను తినాలని సూచిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. యాంటీ యాక్సిడెంట్లు అధికంగా లభించే సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల.. చర్మం అందంగా, ఆరోగ్యాంగా ఉంటుంది.
అంతేకాకుండా చేపలు, గుడ్లు, బాదం వంటి ఒమేగా ఫ్యాట్-3 వంటి ఔషధ గుణాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, చర్మానికి కూడా మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో తీవ్రంగా బాధపెట్టే పగుళ్లు వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
చర్మం పొడిబారకుండా…
10:17 pm