
ఏర్గట్ల మండలకేంద్రంలోని మహిళ సమాఖ్య కార్యాలయంలో సైబర్ నేరాల గురించి ఎస్సై మచ్చెంధర్ రెడ్డి మహిళలకు అవగాహన కల్పించారు. సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ…ఈ రోజుల్లో ఫోన్ ల వాడకం అధికం అయిందని,ఇదే అదును చేసుకుని సైబర్ నెరగాళ్ళు వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని,వారి వలలో పడి డబ్భులు పోగొట్టుకోవద్దని అన్నారు.సైబర్ నేరాల వల్ల మోసపోకుండా మహిళలు గ్రామస్థాయి డ్వాక్రా సంఘ సమావేశాల్లో చర్చించుకోవాలని అన్నారు. గంజాయి,మద్యం వల్ల చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని,ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహిళలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీఎం శ్యామ్,సీసీలు సంతోష్,నవీన్,అకౌంటెంట్ సుప్రియ,గ్రామస్థాయి సంఘాల మహిళలు పాల్గొన్నారు.