జనం కోసం పనిచేస్తా…

– ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటా
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు సంప్రదించిన మాట వాస్తవమే
– వామపక్ష విప్లవ పార్టీల మద్దతు కోరుతున్నా
– క్యాంపు కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో డా.గుమ్మడి అనురాధ
నవతెలంగాణ-ఇల్లందు
అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనం కోసం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు డా.అనురాధ అన్నారు. స్దానికి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో ఆదివారం గుమ్మడి అనురాధ క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా ఇల్లందు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇల్లందు ఒక ఉద్యమ కేంద్రంగా ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చిన్నాభిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రధాన భూమికగా ఉందని, డబ్బు కంటే ప్రజల మద్దతు ముఖ్యమన్నారు. అన్నీ సిద్దమయ్యే రాజకీయాలలోకి వచ్చానన్నారు. గత నాలుగు నెలల క్రితం రాజకీయాలలోకి వస్తారాని టీఆర్‌ఎస,్‌ కాంగ్రేస్‌ పార్టీల జిల్లా, రాష్ట్ర నేతలు సంప్రదించారని అన్నారు. ఇంకా నిర్ణయించు కోలేదని సమాధనమిచ్చినుట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా పోటీలో ఉంటానని మద్దతు తెలపాల్సిందిగా న్యూడెమోక్రసీ, ప్రజాపంధా, ఇతర అభ్యుదయ పార్టీల వారికి లేఖలు రాశారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాలు, మండాలు పర్యటిస్తానని సమస్యలు తెలు సుకుని అభివృద్ధికి పాటుపడతానన్నారు. ప్రొఫె సర్‌గా విద్యావేత్తగా, ఉన్నతోద్యోగిగా ఉన్నప్పటికి ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో రాజకీయా లలో అడుగుపెట్టినట్లు తెలిపారు. ప్రోత్సాహించిన, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగులోత్‌ రమేష్‌, పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.