– సంపూర్ణ మద్దతు తెలిపిన వీఓఏల మండల సంఘం
నవతెలంగాణ-తలకొండపల్లి
తక్షణమే గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఓఏల జిల్లా కమిటీ సభ్యులు అరుణ శశికళ డిమాండ్ చేశారు. మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలో 34 రోజులుగా కార్మికలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసి వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారి వ్యక్తిగత ఖాతాలో కనీస వేతనం రూ.19,500 ప్రతి నెల జమ చేయాలని డిమాండ్ చేశారు. పనిచేస్తూ వారు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వీఓఎల మండల నాయకులు పోలే నరసింహ, కృష్ణారెడ్డి, కల్పన, యాదయ్య, యాదమ్మ, అంజమ్మ, భాగ్యలక్ష్మి, వి నరసింహ, రాణి, శివ, నీల జోష్ణ, కార్మికులు యాదమ్మ, అలివేల, రవనీల, రామచంద్రి, జంగయ్య, యాదయ్య, రాములు, అనిత, జంగమ్మ, వెంకటమ్మ, శాంతమ్మ, కలమ్మ, రాములమ్మ, పాండు, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.