పరిగి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పరిగి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి అన్నారు. మంగళవా రం పరిగి పట్టణ కేంద్రంలోని 7,8,9 వార్డుల్లో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, ఎమ్మెల్యేకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలనీలోని ప్రతి ఇల్లు తిరుగుతూ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. పరిగి పట్టణానికి మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్‌ రెడ్డి సహకారంతో పరిగి పట్టణానికి రూ.25 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పరిగి పట్టణం నూతన మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు రూ.15కోట్ల మంజూరయ్యాయని తెలిపారు. ఆ నిధులతో పరిగి పట్టణంలోని ప్రధాన రహదారులు పూర్తి కావడంతోపాటు, డంపింగ్‌ యార్డ్‌, శ్మశానవా టిక, వెజ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు వేగవం తంగా జరుగుతున్నాయన్నారు. మరో రూ.25 కోట్ల తో ప్రతి వార్డులో సీసీరోడ్లు, అండర్‌ డ్రయినేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, వీధి దీపాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘల భవనాలు, పార్కులు, క్రీడా ప్రాంగ ణాలు పనులను పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్ర మంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్‌ రెడ్డి, ఎంపీపీ అరవింద్‌ రావు, మార్కెట్‌ చైర్మన్‌ సురేందర్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు ఆంజనేయులు, బీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్లు వెంకటేష్‌, రాములమ్మ, రియాజ్‌, నాగేశ్వర్‌ ఎదిరే కృష్ణ, మునీర్‌, రవికుమార్‌, మీర్‌ తహెర్‌ అలీ, మౌలానా, అన్వర్‌ హుస్సేన్‌, పిఎసిఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌ దోమ రామచంద్రయ్య, పట్టణాధ్యక్షులు మంగు సంతోష్‌, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయా కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.