– భావితరానికి మార్గ దర్శకం
– మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యువత నిర్ణయాలు భావితరానికి మార్గమంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో యువ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మంత్రి మాట్లాడారు. యువత అండదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని చెప్పారు. యువత తీసుకుంటున్న నిర్ణయాలతోనే ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పారు. నాయకులు ఎక్కడ గొప్పగా ఆలోచన చేస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. ఇందుకు యువత ప్రోత్సాహం కూడా ఉపయోగ పడుతుందని మంత్రి చెప్పారు. ఉన్నత చదువులు, ఉద్యోగ ఉపాధి కల్పనకోసం యువత హైదరాబాద్ నగరంలో స్థిరపడటం సంతోష కరమైన విషయం అన్నారు.