యువత చూపు కాంగ్రెస్ వైపు

 – కండువాలు కప్పి ఆహ్వానించిన దుద్దిళ్ల  
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలో యువత కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ చేరికల జోరు ఊపందుకొంటుంది. బుధవారం మండలంలోని గాధంపల్లి, కొయ్యుర్, తాడిచెర్ల గ్రామాలకు చెందిన యువకులే కాకుండా మంథనిలోని లెక్కేపూర్ యువకులు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు వారికి జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  దుద్దిళ్ల శ్రీదర్ బాబు హస్తం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ యువత కోసం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి ఆకర్షనీతులై యువత కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తోందన్నారు. శ్రీదర్ బాబు గెలుపే లక్ష్యంగా తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా పార్టీలో చేరిన యువకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.