చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి

యువత సమాజసేవలో ముందుండాలి: ఎస్సై విద్యాచరణ్‌ రెడ్డి
నవతెలంగాణ-పెద్దేముల్‌
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజ సేవలో ముందుండాలని పెద్దేముల్‌ ఎస్సై విద్యా చరణ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో యువకు లకు, గ్రామస్తులకు పోలీస్‌ చట్టాలపై, సైబర్‌ క్రైమ్‌ పట్ల ఎస్సై విద్యా చరణ్‌ రెడ్డి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ…ముఖ్యంగా యువత సైబర్‌ క్రైమ్‌ పట్ల అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రా ఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్కరూ బైక్‌ నడిపే టప్పుడు తప్పనిసరిగా హెలిమెంట్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో 100 డయాల్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ నారా యణ, కానిస్టేబుల్‌ శివ, మున్నయ్య, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.