యువత రాజీవ్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటేషన్‌లో పాల్గొనాలి

కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కావలి చంద్రశేఖర్‌
నవతెలంగాణ-షాబాద్‌
యువత రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటేషన్‌లో పాల్గొని, తమ ప్రతిభ చూపించి విలువైన బహుమతులు గెల్చుకోవాలని కాంగ్రెస్‌ షాబాద్‌ మండలాధ్యక్షులు కావలి చంద్ర శేఖర్‌ అన్నారు. సోమవారం షాబాద్‌ మండల పరిధిలోని హైతాబాద్‌ గ్రామంలో రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్‌ కాంపిటీషన్‌ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్‌ డిక్లరేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా కాంగ్రెస్‌ చేపట్టినటువంటి రాజీవ్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కాంపిటేషన్‌్‌లో యువత విరివిగా పాల్గొనాలని సూచించారు. 16 నుంచి 35 ఏండ్లలోపు ఉన్న యువత ఈ కాంపిటీషన్‌కు అర్హత ఉంటుందని తెలిపారు. కాంపిటే షన్‌లో పాల్గొనే యువత ముందుగా రిజిస్ట్రేషన్‌ నమోదు చేసుకోవడానికి ఫోన్‌ నెంబర్‌ 7661899899కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని, రిఫరెన్స్‌ నెంబర్‌ ఏఎన్‌ఆర్‌ నమోదు చేసు కోవాలని తెలిపారు.ఈ కాంపిటేషన్‌ నమోదు చేసుకో వడానికి చివరి తేదీ జూలై 01 కాగా, జూలై 02వ తేదీన ఈ కాంపిటీషన్‌ జరుగుతుందని తెలిపారు. ఈ కాంపిటీషన్‌లో 60 నిమిషాలు, 60 ప్రశ్నలు ఉంటాయని, క్విజ్‌ పోటీలో ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిపి విజేతలుగా నిలిచిన వారికి, నియోజకవర్గం నుంచి ప్రథమ బహుమతిగా ఎలక్ట్రిక్‌ స్కూటీ ఇవ్వనున్నట్టు చెప్పారు. మిగతా విజేతలకు లాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, ట్యాబ్‌ మరెన్నో ఇతర బహుమతులు అందించనునట్టు తెలిపారు. నియోజకవర్గం నుంచి యువత అత్యధికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైతాబాద్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్‌ శేఖర్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి, హైతాబాద్‌ ఉప సర్పంచ్‌ చంద్రారెడ్డి, నాయకులు మంగలి శేఖర్‌, కావలి శ్రీరాములు, కావలి రవి, పులిగారి చంద్రయ్య, ఏపీ రెడ్డి. గౌండ్ల సత్తయ్య, ఆకుల శ్రీకాంత్‌, కావలి శ్రీకాంత్‌, పవన్‌, చంద్రం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.