కవిత మాటల్లో చిత్తశుద్దేది? : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
33 శాతం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చిన కవితమ్మ చిత్తశుద్ది ఇదేనా? అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్ల కోసం పోరాడాలని హితవు పలికారు.రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించే తీరిక లేదా? అని ప్రశ్నించారు.