అంచనాలు పెంచిన ట్రైలర్‌

విజయ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అంచనాల చిత్రం ‘వారసుడు’. తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా ఈనెల 12న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. విజయ్‌ సరసన రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘ఈ సినిమా కోసం విడుదలైన ప్రతి ప్రమోషనల్‌ మెటీరియల్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ‘వారసుడు’ ఆల్బమ్‌ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ని తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా’ అని జయసుధ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌ .. ఆద్యంతం ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ అనుభూతిని ఇచ్చింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో పండక్కి విందు భోజనం లాంటి సినిమా ‘వారసుడు’ అనే నమ్మకానన్ని ఇచ్చింది ట్రైలర్‌. విజయ్‌ ఎంట్రీ అభిమానులకు గూస్‌ బంప్స్‌ తెప్పించింది. తలైవ, రంజితమే పాటలలో విజరు చేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ అవుట్‌ స్టాండింగ్‌గా ఉన్నాయి. విజయ్‌ యాక్షన్‌, డైలాగ్స్‌, ఎమోషన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. విజరు- రష్మికల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. విజరుకి తండ్రిగా శరత్‌ కుమార్‌, తల్లిగా జయసుధ, బ్రదర్స్‌గా శ్రీకాంత్‌, కిక్‌ శ్యామ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రైలర్‌లో శరత్‌ కుమార్‌, జయసుధ, శ్రీకాంత్‌, శ్యామ్‌ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకాష్‌ రాజ్‌ పాత్ర రూపంలో విజరు కుటుంబానికి ఒక పెద్ద సవాల్‌ ఎదురౌతుంది. ఆ సవాల్‌ని ఎదుర్కొని కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేది చాలా క్యూరియాసిటీగా చూపించారు’అని చిత్ర బృందం తెలిపింది.