దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

– భావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ వికారాబాద్‌ జిల్లాయాక్షన్‌ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
వికారాబాద్‌ జిల్లా యాలాల మండల కేంద్రంలోని యాలాల పో లీస్‌స్టేషన్‌లో దేవనూరు గ్రామానికి చెందిన మెట్లి నరేష్‌ అనే దళిత యువకుడిపై, పోలీసులపై దాడి చేసిన శివ స్వాములపై అట్రాసిటీ, 307 కేసులు పెట్టలని అంబేద్కర్‌ వాదులు, అభ్యుదయ వాదులు, భా వ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ కోటిరెడ్డికి మెమొరాండం అందించారు. జేఏసీ స్వేచ్ఛ ముఖ్యకార్యకర్తల సమావేశం సీఐడీ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌ అధ్యక్షతన సమా వేశం జరిగింది. మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిమ్మని శంకర్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమారపు రవి, జిల్లా కోకన్వీనర్‌ మహేందర్‌, సెల్‌ మండలాధ్యక్షులు బెగారి రవీందర్‌, అంబేద్కర్‌ యు వజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆనంద్‌ మాదిగ చేసిన జిల్లా అధ్యక్షు లు ఈదన్నోల్ల రాజు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌ నరసింహులు మాట్లాడుతూ.. ఇద్దరి మధ్యవ్యక్తిగత గొడవను శివ స్వా ములు స్వామీజీల ముసుగులో మనువాదూలు దళితులపై అంబేద్క ర్‌ వాదులపై ప్రజాస్వామ్యవాదులపై కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోయి దళితులపై పోలీస్‌లపై దాడులు చేసి చంపేందుకు ప్రయ త్నించిన శివ స్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో 307 కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. లేనిచో జిల్లా వ్యాపితంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. సమావేశంలో కేవీపీఎస్‌, సీఐ టీయూ రైతు సంఘం గిరిజన సంఘం అంబేద్కర్‌ జేఏసీ నాయకులు సుదర్శన్‌ హరికృష్ణ శ్రీనినాయక్‌ రవి శ్రీనివాస్‌ రాజు రాములు అంజయ్య యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.