నిమ్స్‌ హాస్పిటల్‌లో వరల్డ్‌ క్యాన్సర్‌ డే వేడుకలు

 నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది క్యాన్సర్‌ అనీ, ఇది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి అని నిమ్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భీరప్ప అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, నివారణ, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స విధానాన్ని ప్రొత్సహించేందుకు ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 4వ తేదీన నిమ్స్‌ హాస్పిటల్‌లో క్యాన్సర్‌ డేను జరుపుకుంటామని తెలిపారు. క్యాన్సర్‌ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయ న్నారు. క్యాన్సర్‌ను పారదోలేందుకు అన్ని విభాగాలు ఏకం కావల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ”క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌” పేరిట వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్‌ నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నట్టు తెలిపారు. మెడికల్‌ ఆంకాలజీ విభాగాధి పతి డాక్టర్‌ గుండేటి సదాశివుడు మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించవచ్చు అన్నారు. ఈ వ్యాధిని జయించాలంటే కావల్సింది మెరుగై న వైద్యమే కాక మనోధైర్యం అత్యంత ముఖ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెం డెంట్‌ నిమ్మ సత్యనారాయణ, డాక్టర్‌ కృష్ణారెడ్డి,్డ ,సర్జికల్‌ అంకాజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజ శేఖర్‌, రేడియేషన్‌ అంకాజీ విభాగాధిపతి డాక్టర్‌ మోనికా, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శాంతవీర్‌, డాక్టర్‌ చెన్నమనేని రచన, మార్తా రమేష్‌, శ్రీనివాసులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, నిమ్స్‌ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.