రాజకీయ సహచరుడు “దుద్దుకూరి” కి తాటి పరామర్శ

నవతెలంగాణ – అశ్వారావుపేట
పినపాక నియోజక వర్గం,భూర్గంపాహాడ్ మండల కేంద్రానికి చెందిన తన రాజకీయ సహచరుడు దుద్దుకూరి శ్రీనివాసరావును మంగళవారం భూర్గంపాహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. దుద్దుకూరి శ్రీనివాసరావు సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో వారి నివాసానికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తాటి వెంట దుద్దుకూరి రాము, తదితరులు ఉన్నారు.