ఈ నెల 12న మువ్వా పద్మావతి – రంగయ్య పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సాయంత్రం 5 గం||లకు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మువ్వా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2021 ఏడాదికి గాను ఖాదర్ మొహియుద్దీన్‌కు, 2022 ఏడాదికి గాను కె.శ్రీనివాస్‌కు పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడిం చారు. ఆవంత్స సోమసుందర్ పురస్కారాన్ని కె.ఆనందాచారికి అందించనున్నట్లు పేర్కొన్నారు. 2022 నవస్వరాంజలి పురస్కా రాలను సుంకర గోపాల్, ఎల్.లహారి, గూండ్ల వెంకటనారాయణ, లావణ్య సైదీశ్వర్, స్పూర్తి కందివనం, ఎస్.విద్యాసాగర్, రూపా రుక్మిణి, మహ్మద్ గౌస్, షేక్ రిజ్వానాకు అందించనున్నారు. ఇదే సభలో మువ్వా శ్రీనివాసరావు రాసిన అనితరుడు, దృశ్యం, సమాంతర ఛాయలు కన్నడ అనువాదం లక్కూరు ఆనంద, హిందీ అనువాదం శాంతసుందరి పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు పేర్కొ న్నారు. ఆచార్య కొనకలూరి ఇనాక్ అధ్యక్షతన నిర్వహించే ఈ సభకు కె.శివారెడ్డి, నగముని, అల్లంనారాయణ, జూలూరి గౌరీ శంకర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, సాక్షి సంపాదకులు వర్దెల్లి మురళీ, ఆంధ్రప్రభ సంపాదకులు వైఎస్‌ఆర్‌శర్మ తదితరులు హాజరు కానున్నారు.