15న దేవరాజు మహారాజు ‘సప్తతి’ వేడుక

సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు డా. దేవరాజు మహారాజు. వారి ”సప్తతి” వేడుక ఈ నెల 15న ఉదయం 10 గం||లకు మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని సి.ఆర్‌. ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్నారు. అగ్రశ్రేణి సంపాదకులు ఎ.బి.కె. ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వ హించే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సురవరం సుధాకర్‌రెడ్డి, అత్మీయ అతిథులుగా సుధామ, డా|| జి.వి. రత్నాకర్‌, బి.సాంబశివ రావు హాజరు కానున్నారు. వివరాలకు డి.హనుమంత రావు 8247848044 నంబరు నందు సంప్రదించవచ్చు.