20 నుంచి 24 వరకు పోస్టల్‌ మహామేళా

–  చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ కె విద్యాసాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోస్టల్‌ డైరెక్టరేట్‌ ఆదేశానుసారం ఈనెల 20 నుంచి 24 వరకు అన్ని తపాలా కార్యాలయాల్లో పోస్టాఫీస్‌ ఖాతాల మహామేళాను నిర్వహిస్తున్నట్టు చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ కె విద్యాసాగర్‌ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జీపీవోలో పోస్టాఫీస్‌ ఖాతాలను తెరిచేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. పొదుపు ఖాతా, రికరింగ్‌ డిపాజిట్‌, సుకన్య సమృద్ధి, ప్రజా భవిష్య నిధి, వయోజనుల ఖాతాలను తెరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన కోరారు.

Spread the love