నామినేషన్ వేసిన మేడి ప్రియదర్శిని

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్లుగా బీఎస్పీ ఇన్చార్జిగా ప్రజా సమస్యలపై ప్రజలకు మద్దతుగా ఉంటూ పోరాడుతున్నానన్నారు. ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వర్గ పోరు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగమే మేనిఫెస్టో ఉండే విధంగా బీఎస్పీ విద్యా, వైద్యం, ఉపాధి కోసం కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,వివిధ మండల అధ్యక్షులు  మండల కమిటీ లు బూత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.