దీపావళి – హైకూలు

Diwali - Haikuదీపావళి
ఐనా ఊరి గుడిసెలో
గుడ్డి దీపం

కొన్నిటపాసులు
తుస్సుమన్నా
నవ్వులు పేలుతూ

అల్లరిలో
చిచ్చు బుడ్లు –
పిల్లలు

పిల్లల నవ్వులు
కాకర పువ్వొత్తులు
పెద్దలముఖాల్ని వెలిగిస్తూ

మిణుగురులు
పక్కకు తప్పుకున్నాయి
తారాజువ్వలకు చోటిస్తూ

చిచ్చుబుడ్డికన్నా
పిల్లాడి ముఖంలోనే
వెలుగెక్కువ

భూచక్రం
నన్ను నా బాల్యం చుట్టూ
తిప్పుతూ

నేను వెలిగించిన
లక్ష్మి బాంబెప్పుడూ
తుస్సే

పాంబిళ్ల
పిల్లల ఆనందం
బుసకొడుతోంది

అతనెక్కడ
బత్తెలిగించినా
బాంబై పేలుతుంది

కొత్త చొక్కా –
సీమటపాసులు
చుక్కలముగ్గేశాయి

సీటుకింద బాంబు
తడిసినా
పేలుతుంది

దీపావళి కదా
ఎటు పారిపోయాయో
చందమామ చుక్కలు

చందమామ
పొగచూరింది
రాత్రంతా బాంబులు

దీపావళి
ఆకాశం నిండా
పొగబాంబు పేలింది

టపాసులు
కాల్చకముందే పేలుతున్నాయి
ధరలు

బత్తెలిగించే భయం
బాంబుతోపాటే
పేలిపోతుంది

రాత్రంతా
పోగుపడిన టపాసుల చెత్త
తెల్లారితే దర్పం

టపాసులు
తడిసి పేలనంటున్నాయి –
గాజాపిల్లల ద్ణుఖం

పాపడిగింది
గాజా పిల్లల బాంబులకు
కన్నీళ్లొస్తున్నాయెందుకు నాన్నా
లి
భీష్మించాడు
టపాసులు కాల్చనని మావాడు
గాజా పిల్లలు

తారాజువ్వతో
సంఘీభావ సందేశం
గాజాపైకి

మా పిల్లలు
టపాసులు మానేశారు
గాజాపిల్లల దు:ఖంచూసి

పిల్లలెక్కడైనా పిల్లలే
దీపావళెలా జరుపుకునేది
గాజా

ఇక్కడి ఆకాశం
అక్కడి ఆకాశాన్ని గుర్తుచేస్తోంది
బాంబులు కాల్చలేను
– చిత్తలూరి, 9133832246