ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపండి

– సీపీఐ(ఎం) అసెంబ్లీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌
– పార్టీ టూ టౌన్‌ కమిటీ విస్తృత ప్రచారం
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)కి ఓటేసి ప్రశ్నించే గొంతు అయిన నన్ను అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) అసెంబ్లీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం టూ టౌన్‌ లోని పెవిలియన్‌ గ్రౌండ్‌, మామిళ్ళగూడెం, ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రా శ్రీకాంత్‌ మాట్లాడుతూ టూ టౌన్‌ ప్రాంతంలో సీపీఎం అధ్వర్యంలో మామిళ్ళగూడెం అండర్‌ రైల్వే బ్రిడ్జి, కొత్త బస్టాండ్‌ అవినీతి, రోడ్లు, డ్రైనేజీ అనేక రకాల సమస్యలపై నిరంతరం పోరాడింది సీపీఎం అని అన్నారు. ఖమ్మంలో రెండు కార్పొరేట్‌ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, వారు ఎప్పుడైన ప్రజా సమస్యలపై పోరాడేరా అన్ని ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తున్న నన్ను గెలిపించాలని కోరారు. నేను సామాన్యుడిని అన్ని గత 35 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో వారి సమస్యలపై పోరాడుతూ, ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గత 45 సంవత్సరాల నుంచి సీపీఐ(ఎం)లో ఉంటూనే అనేక పోరాటాలు ప్రజల సమస్యల కోసం కృషి చేశానని తెలిపారు. అందుకనే ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని, నన్ను గెలిపిస్తే అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై పోరాడుతానని, మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించగలరని ప్రజలను కోరారు. ఖమ్మంలో ప్రశ్నించే గొంతుక సీపీఎంకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్‌, సీపీఐ(ఎం) టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు మచ్చ సూర్యం, లక్ష్మి, నర్రా రమేష్‌, చింతల రమేష్‌, తుడుం ప్రవీణ్‌, జే.వెంకన్నబాబు, భూక్యా ఉపేందర్‌ నాయక్‌, యాట రాజేష్‌, బి.సాగర్‌, కే.రాజేష్‌,యమ్‌.డి. గౌస్‌, సి.యచ్‌. భద్రం, షేక్‌. హుస్సేన్‌, పకిర్‌ సాబ్‌, బి.ముత్తయ్య, వీరప్ప, స్వామి, లక్ష్మయ్య, గుమ్మడి. బిక్షం, నరపోగు. నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.