ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-మంచాల
ప్రజల చూపు కాంగ్రెస్‌ వైపే ఉందని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగుర వేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌ రెడ్డి రంగా రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైయ్యారనీ, ఇటు ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తేకుండా, సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయడంలో పూర్తిగా విఫలమైయ్యారని అన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు పూర్తిగా నిరుత్సాహంతో విసుగు చెంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనీ, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్‌ రెడ్డి, నాయకులు చేతాల సంజీవ, ఆవుల మల్లేష్‌, ఓరుగంటి లింగంగౌడ్‌ , మహేష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.