– ఉపసంహరించుకున్న నలుగురు
– గుర్తుల కేటాయింపు
– తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాసరావు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో 21 మం ది అభ్యర్థులు రేసులో తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డిఓ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నలుగు రు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారని తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థు ్థలకు గుర్తుల కేటాయింపు జరిగిందన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్య ర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారని తెలిపారు. రోహిత్ రెడ్డి(బీర్ఆర్ఎస్)కి కారు గుర్తు బోయిని చంద్రశేఖ ర్(బీఎస్పీ)కి ఏనుగు గుర్తు, బుయ్యని మనోహర్ రెడ్డి(కాంగ్రెస్) హస్తం గుర్తు, అవుటి శ్రీశైలం(నవరంగ్ కాం గ్రెస్)కి బ్యాట్ గుర్తు, గుడిసే గోపాల్ (ప్రజా వెలుగు పార్టీ)కి కెమరా గుర్తు, గౌరీ శ్రీశైలం(ధర్మ సమాజ్ పార్టీ) టార్చ్ లైట్ గుర్తు, ధర్మపురం రాంచం ద్రయ్య (భారత చైతన్య యువజన పార్టీ)కి చెరుకు రైతు గుర్తు, నేనావత్ హరినాయక్(బహుజన ముక్తి పార్టీ)కి మంచం గుర్తు, నేమూరి శంకర్ గౌడ్ (జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి)కి గాజు గ్లాసు గుర్తు, మనోహర్ రెడ్డి(జన శంఖారావం పార్టీ)కి బెండ కాయ గు ర్తు, మారోజూ సునిల్ (బహుజన్ లెఫ్ట్ పార్టీ)కి సాసర్ గుర్తు, విఠల్ రాథోడ్ (బ్లూ ఇండియా పార్టీ)కి మిక్సీ గుర్తు, అరవింద్ (స్వతంత్ర)కి విజిల్ గుర్తు,నొముల అనిల్(స్వతంత్ర) బూర గుర్తు, పెద్దోళ్ల ఆనంద్ కుమార్ (స్వ తంత్ర)కు గ్యాస్ సిలిం డర్ గుర్తు, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ (స్వతంత్ర)కు చెప్పులు గుర్తు, మంబాపురం విజయేం దర్ (స్వతంత్ర)కు టూత్ బ్రష్ గుర్తు,రాథోడ్ ఆనంద్ నాయక్(స్వతంత్ర) పండ్ల బుట్ట గుర్తు, పి.రోహిత్ రెడ్డి (స్వతంత్ర)కు షిఫ్ గుర్తు, చిలుక గోపాల్ (స్వతంత్ర) కు పల్లకి గుర్తు, బి. సుమంత్ ( స్వతంత్ర)కు క్యాలీ ఫ్లవర్ గుర్తు కేటాయించినట్లు ఎన్నికల అధికారి శ్రీని వాసరావు తెలిపారు. నవంబర్ 30నఎన్నికలు డిసెంబర్ 3వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు.