కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి..

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: దేవలమ్మ నాగారంలో సీపీఐ  బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవలమ్మ నాగారం మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని అన్నారు. మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కోశాధికారి బొమ్మ తిరుమల్, జక్క యాదిరెడ్డి, బొమ్మ సాలయ్య, చీమర్ల లింగయ్య, కుంటి యాదయ్య, వడ్డేపల్లి పరమేష్, చీమ కండ్ల సాయి,బొమ్మ నరసింహ, దోనూరి వెంకటరెడ్డి, బొడిగె మల్లేష్, దేవులపల్లి వెంకటేష్, దేవులపల్లి విజయ్, బొమ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.