ఒక్క చిన్న చిట్కా మీ పని తీరునే మార్చేస్తుంది. సమయం వథా ఉండదు. డబ్బు ఖర్చు లేదు. మరెన్నో లాభాలు ఉన్నాయి. కిచెన్‌లో ఇట్టే పనులు చక్కబెట్టడానికి కొన్ని చిట్కాలు మీ కోసం..
– నూనెలో పచ్చి మిరపకాయలను వేయించేటప్పుడు మధ్యలోకి చీల్చితే అవి పేలకుండా ఉంటాయి.
– పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే వాటి తొడిమలను తొలగించి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
– అన్నం తెల్లగా ఉండాలంటే ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేసుకోవాలి.
– దోశల పిండి ఎక్కువ పులిసిపోతే కాస్త గోధుమ పిండి చేర్చి వేసుకుంటే దోశలు రుచిగా తయారవుతాయి.
– చపాతీ పిండిలో కాసిని పాలు కలిపితే చపాతీలు మదువుగా వస్తాయి.
– పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి చూడండి.