వృద్ధాప్యం

నిత్యం ఒంటరితనం
పలకరిస్తునే ఉంటుంది !
అనుక్షణం ప్రతి మజిలీ కళ్ళముందు
కదలాడుతునే ఉంటుంది !
ఎప్పుడూ చెవి నిండా స్వీయ మాటలు
ప్రతి ద్వనిస్తూనే ఉంటాయి !
సదా మూడవకాలు, ఆరవ వేలు
అంటిపెట్టుకునే ఉంటాయి !
ఎవరన్నారు వృద్ధాప్యం
ఎడారి జీవితమని !
అయిన వాళ్ళంతా ఎండమావుల్లా
చుట్టూ కానొస్తుంటేనూ !!
– తిప్పాన హరి రెడ్డి, 9483732412