కంటికి కనిపించకుండా నచ్చిన వారిపై చూపించే మధురమైన భావన ప్రేమ.. ఎవరైనా నచ్చితే వారిని బలంగా కోరు కోవడం, వారిపై ఆశలు పెంచుకోవడం సహజం. అయితే కలకాలం జీవించ డానికి, బంధం బలంగా ఉండేందుకు ప్రేమ ఒక్కటి ఉంటే చాలదు.. ప్రేమ ముఖ్య మైనదే అయినప్పటికీ మరికొన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. జీవితంలో ప్రేమ కంటే ముఖ్యమైనవేంటో తెలుసుకుందాం..
భద్రత : బంధంలో భాగస్వామితో సురక్షితంగా ఉన్నట్టు భావించడం ముఖ్యం. మీ భాగస్వామిని మీరు చాలా ప్రేమించినా.. వారు మీకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎంత ఇష్టపడినా ప్రయోజనం ఉండదు. ప్రేమ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం.
నమ్మకం : ప్రేమలో అన్నింటికంటే ముఖ్యమైనది ఒకరిపై ఒకరికి నమ్మకం. మీరు అవతలివారిని ఎంత ప్రేమించినప్పటికీ నమ్మకం లేకపోతే ఆ బంధం నిలబడదు. ఆరోగ్యకరమైన బంధంలో ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నమ్మకం ద్వారానే ఇద్దరి మధ్య బంధం బలంగా ఉంటుంది.
గౌరవం : ప్రేమికులు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒక జంటకు ఒకే ఆసక్తి లేదా అభిరుచులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే బంధం బీటలు వారుతున్నట్లే.
మాటలు : కమ్యూనికేషన్ అనేది ప్రేమకు ఇంధనం లాంటిది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, పరిస్థితుల గురించి సరిగా చర్చించుకోలేని పరిస్థితిలో ఉంటే బంధం బలహీనంగా ఉన్నట్టే. సరిహద్దులను నిర్ణయించడానికి ప్రేమను వ్యక్తీకరించడానికి, పరిష్కరించడానికి, అవసరాల గురించి మాట్లాడానికి సంభాషణ అనేది చాలా అవసరం. మంచి సంభాషణలు దీర్ఘకాలిక బంధానికి దోహదపడతాయి.