పెసలతో కాంతివంతంగా…

పెసలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ రోజుల్లో వాటిని మొలకల రూపంలో తినడం అలవాటు చేసుకున్నారు. ఆహారంగానే కాదు, చర్మానికి కూడా వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. చర్మం మదువుగా, కోమలంగా, కాంతివంతంగా మారాలంటే పెసలతో ఫేస్‌ప్యాక్‌ చేసి ఉపయోగించుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..!
రెండు చెంచాల పెసలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ పెసలను పేస్టులా చెసి, అందులో చెంచా బాదం నూనె, చెంచా తేనె వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగేసుకుంటే కోమలమైన చర్మం మీ సొంతం.
పెసలును గ్రైండ్‌ చేసి… పొడి చేసుకుని ఉంచుకోవాలి. చెంచా పిండి, చెంచా తేనె తీసుకుని కలిపి ముఖానికి బాగా పట్టించాలి. పూర్తిగా ఆరిపోయేవరకూ అలా వదిలేయాలి. తర్వాత దూది లేదా నీటితో మెల్లగా తడి చేస్తూ మర్థన చేసినట్లుగా మొత్తం తుడిచేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, చర్మంపై మతకణాలు, క్రిములు తొలగిపోతాయి.
పెసల పేస్టులో రెండు టీ స్పూన్ల యుగర్ట్‌ వేసి కలపాలి. మచ్చలున్న చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. పది నిమిషాలు అలాగే ఉంచేసి చల్లటి నీటితో కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఫలితం ఉంటుంది.

Spread the love