సెక్యులర్ రైటర్స్ ఫోరంగా ఏర్పడిన ‘సమూహ’ ఆవిర్భావ సభ ఈ నెల 12న శనివారం ఉదయం 10:00 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. సినీ నటులు ప్రకాష్‌రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వక్తలుగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, రచయిత, జర్నలిస్టు మీర్ అయూబ్ అలీఖాన్, సామాజిక కార్యకర్త పద్మజాషా, హెచ్‌సియు ప్రొఫెసర్ భంగ్యా భూక్యా పాల్గొంటారు.