తీరొక్క పూల వనంలో
వాదాలు వర్ణాలు వదిలి
సీతాకోక చిలుకలు అయి వాలదాం
పరిమళాలు ప్రతి ఒక్కరికీ సమానంగా
మహిమ గల మట్టిలో
మంచి మొక్కలు నాలుగు నాటి
దేశాన్ని ఆనంద బందావనం చేద్దాం
హదయాలన్నీ వికసంచాలి స్వేచ్ఛగా
ఒంటరి బాటను వీడి
నలుగురితో భుజాలు కలుపుదాం
కొత్త బాటలు వేసి మార్గదర్శకం అవుదాం
తరాలకు మనమే మేటి ఆదర్శం అవ్వాలి
భాషా భేషజాలు వదిలి
జాతీయ గీతం పాడుదాం
ఆసేతు హిమాచలం వరకు
భావాలు కలుపుదాం
చల్లని స్నేహ సౌరభాల పవనాలు
నాలుగు దిక్కులా
రంగు రేఖలు చెరిపేసి
రాజకీయాలకు గౌరవం పెంచి
అభివద్ధి ఫలాలు అందరికీ పంచుదాం
ప్రపంచానికి మార్గ దర్శకత్వం మనమే అవ్వాలి
విద్వేషాలను ఇక్కడే వదిలి
మానవత్వం అందరిలో వెలిగిద్దాం
నువ్వు నేనూ
ఇక మనతో ముందుకు కదులుదాం
ఇక శాంతి వనం విస్తరణనలు దిశలుగా
వజ్రోత్సవ కానుకగా
మనసులను అనుసంధానం చేసి
మనుషులం మరింత విశాలం ఆవుదాం
మానవత్వం మరింత గర్వంగా
కాలర్ ఎగుర వేస్తుంది..
– దాసరి మోహన్, 9985308080