నవతెలంగాణ – హైదరాబాద్: ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్ కాయిన్ పాతాళానికి చేరుకోనుంది. ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ X తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్ ధర క్రాష్ అయింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ధర 28000డాలర్ల నుండి 25000డాలర్లకు తగ్గింది. గత రెండు నెలల్లో బిట్‌కాయిన్ ధరల్లో ఇదే అతిపెద్ద తగ్గుదల. దీని ప్రభావం ప్రపంచంలోని మిగిలిన క్రిప్టోకరెన్సీలపై కనిపించింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో సుమారు 6 శాతం క్షీణత కనిపించింది. అన్నింటికంటే ఎలాన్ మస్క్ స్పేస్ X ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం. ఎలోన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ SpaceX 2021 ప్రారంభంలో కొనుగోలు చేసిన బిట్‌కాయిన్‌ను సుమారు 373 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఆగస్ట్ 17 నివేదిక ప్రకారం.. SpaceX తన బ్యాలెన్స్ షీట్‌లో 2021 – 2022లో 373 మిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌లను కలిగి ఉంది.