బలపరుచుకోవాల్సిన బంధం

బలపరుచుకోవాల్సిన బంధంఎంత బాధలో ఉన్నాసరే.. ప్రాణ స్నేహి తులతో పంచుకుంటే ఆ బాధ తగ్గిపోతుంది. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. స్నేహి తుల తోడు ఉంటే చాలు ప్రపంచాన్ని జయిం చిన అనుభూతి కలుగుతుంది. విషయం ఏదై నా సరే.. వారితో కష్టసుఖాలను పంచుకోనిదే నిద్ర పట్టదు. మన జీవితంలో స్నేహానికి అంత విలువ ఉంటుంది. కానీ కారణాలు ఏవైనా, కొన్నిసార్లు స్నేహం వికటించే ప్రమాదం ఉంది. మీ స్నేహ బలం పల్చబారుతుందని గుర్తించ డానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే…
ఎంత పెద్ద సమస్యయినా సరే, ఫ్రెండ్‌ తో చర్చించడానికి మీరు ఇష్టపడట్లేదంటే ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతోందని భావిం చాలి. వారితో సెట్‌ కాదు అనుకున్నప్పుడు.. మీరు వారితో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపరు.
స్నేహితుల్ని తరచూ కలవడం, సర దాగా మాట్లాడటం ఒక ట్రీట్‌ లాగా అనిపి స్తుంది. కానీ ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు ఎందుకు ఎదురుపడ్డామనే భావన కలుగు తుంది. వారు పక్కన ఉన్నంత సేపు ఇబ్బందిగా అనిపిస్తుంది.
సాధారణంగా స్నేహితుల మధ్య కోప తాపాలకు చోటుండదు. ఒకవేళ కోప్పడినా వెం టనే సారీ చెప్పుకుని కలిసిపోతారు. కానీ స్నేహం సన్నగిల్లుతున్నప్పుడు మాత్రం ఇందు కు వ్యతిరేకంగా అనిపిస్తుంది. వారు మీతో మాట కలిపినా, మీరు వారితో మాట్లాడినా ఏదో ఒక సందర్భంలో చిరాకుగా, కోపంగా అనిపిస్తుంది. మీ స్నేహితులతో చేసే ఎలాంటి చర్చలైనా కోపం తెప్పిస్తాయి.
ఒకరంటే ఒకరికి పడనప్పుడు, ఎదుటి వారి ప్రవర్తన మారుతుంది. ఒక్కోసారి విచి త్రంగా ప్రవర్తిస్తారు. మీరు మీ స్నేహితుడి గు రించి ఆరా తీస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వారు మాత్రం.. మీరంటే తనకి ఇష్టం లేనట్లు, మీరు తనకు ముఖ్యమైన వ్యక్తి కాదన్నట్లు ప్రవర్తిస్తారు.
స్నేహితుల మధ్య మంచి బంధం ఉంటే, ప్రతి చిన్న విషయానికి ప్రశంస లభి స్తుంది. కానీ స్నేహం తగ్గితే, వారు ఎంత పెద్ద లక్ష్యం సాధించినా మీరు పట్టించుకోరు. వారిని మెచ్చుకోవాలనే ఆలోచన కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.
మీరు మాత్రమే వారిని స్నేహితుడిగా భావిస్తే సరిపోదు. ఇద్దరికీ అదే భావన ఉండా లి. వారు మిమ్మల్ని సరిగా పట్టించుకోకుండా, అంటీ ముట్టనట్లు ఉంటే మాత్రం మీరు ఆలోచించాల్సిందే. మీరు మాత్రమే మీ స్నేహి తుడిని పలకరిస్తూ, వారి గురించి ఆరా తీస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ కోసం అలా చేయరు.