నిశీధి హృదయం…

A cold heart...నిశీధి నిందించెనే
ప్రతిరోజు కన్నీటితో తడిపేస్తున్నానని దానికేం తెలుసు
తన ఆలోచనల ముసురే అలా బయటికొస్తోందని…
కన్నులు నిందించెనే
తన రూపాన్ని చూడకుండా చేశానని వాటికేం తెలుసు
అవి చూసే దూరం కన్నా మనసు వెతికిన దూరం ఎక్కువని…
అక్షరాలు నిందించెనే
నా రాతల్లో తన జాడ కనబడుటలేదని వాటికేం తెలుసు
వాటి పుట్టుకే తన అనుభవాలని…
జ్ఞాపకాలు నిందించెనే
కాలంతో పాటు మరిచిపోతానేమోనని వాటికేం తెలుసు
కడలి ముత్యాన్ని దాచినట్టు నాలో తనని దాచుకున్నానని…
– రమేష్‌ మాండ్ర, 8555929026