రంగు రంగుల చిలక..

తెలంగాణ పల్లె కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం ‘తురుమ్‌ ఖాన్‌లు’. స్టార్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌ పై శివకళ్యాణ్‌ దర్శకత్వంలో ఎండీ.ఆసిఫ్‌ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ని శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సాంగ్‌ ‘రంగు రంగుల చిలక..’ పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”రంగు రంగుల చిలుక’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా పాడారు. పాటతో పాటు సినిమా కూడా చాలా హిట్‌ కావాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు. ‘పల్లెటూరు రివేంజ్‌ కామెడీ జోనర్‌తోపాటు మహబూబ్‌ నగర్‌ స్లాంగ్‌లో ఉన్న తొలి సినిమా ఇది. బలమైన కథ, సహజమైన పాత్రలతో చిత్రాన్ని క్వాలిటీగా మా దర్శకుడు శివకళ్యాణ్‌ తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు.