నవతెలంగాణ-హైదరాబాద్ : తాగిన మత్తులో యువకుల బృందం తోటి స్నేహితుడిని పట్టణంలోని రోడ్లపై నగ్నంగా పరిగెత్తించారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన యువకులు ఇటీవల పార్టీ చేసుకున్నారు. అందులో ఓ యువకుడు డ్యాన్స్ చేయలేదనే కోపంతో అతడిని నగ్నంగా చేసి పట్టణంలో పరిగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత్, ఆనంద్, దయానంద్ అనే ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు.