ప్రకృతి – వికృతి

Prakriti - Perversionనాడు పచ్చదనం ఒడిలో పరవశం
నేడు భూతాప తప్పిదాల వివశం
నాడు గలగలల నిండు సెలయేర్లు
నేడు నీరింకిన ఎడారి ఇసుక తిన్నెలు
నాడు శీతల మలయ మారుతాలు
నేడు కృత్రిమత్వపు విషపు గాలులు
నాడు ప్రకృతి సామ్రాజ్యానికి
రాజధానులై వెలసిన పల్లెవైభవాలు
నేడు బతుకు తెరువుకు తరలి
రిక్తమైన అన్నదాతల వ్యవసాయాలు
ఏవీ నాడు ధరణిపై నూరేళ్ళూ
వర్ధిల్లిన సాఫల్య బతుకు చిత్రాలు
నేడంతా కాలుష్య కోరల్లో విలవిల్లాడే
అకాలమృత్యు విధ్వంసక జీవనాలు
నాడన్నీ మట్టి తల్లి ఒడిలో పుట్టిన
సహజత్వాల మధుర పంటలు
నేడన్నీ విషరసాయనాలు కడుపులో
దాచుకుని పుట్టిన కృతక భక్ష్యాలు
పచ్చదనం పరిమళమై ఫరిడవిల్లాలంటే
కాలుష్యం కోరలు పెరికివేయక తప్పదు!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253