ఆద్యంతం థ్రిల్‌ చేసే అన్వేషి

ఆద్యంతం థ్రిల్‌ చేసే అన్వేషివిజయ్ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈనెల 17న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ వి.జె.ఖన్నా మాట్లాడుతూ, ‘ఈ మూవీలో అనన్య నాగళ్ల చేసిన పాత్ర చుట్టూనే సినిమా అంతా తిరుగుతుంది. ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని తెలిపారు. ‘మంచి కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. సినిమా బాగోకపోతే నేను గుండు కొట్టించుకుంటాను’ అని హీరో విజరు ధరణ్‌ దాట్ల చెప్పారు. నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘మా డైరెక్టర్‌ వి.జె.ఖన్నా మేకింగ్‌ చూస్తే ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌ అనరు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతీ ఫ్యామిలీ చూసి ఎంజారు చేయొచ్చు’ అని అన్నారు.