ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారు..

ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారు..రాహుల్‌ విజయ్, శివాని రాజశేఖర్‌ లీడ్‌ రోల్స్‌లో శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌పై బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ, ”ఆర్టికల్‌ 15′ తమిళ్‌ రీమేక్‌లో నా నటన చూసి దర్శకుడు తేజ నాకు ఈ కథ చెప్పారు. ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్‌ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్ర నాది. ఈ పాత్ర కోసం శ్రీకాకుళం స్లాంగ్‌ కూడా నేర్చుకున్నా. ‘లింగిడి లింగిడి..’ సాంగ్‌ వైరల్‌ కావడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ పాట వల్లే ఈ సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. ఇంతలా ఈ పాటను జనాల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌కి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఒరిజినల్‌ చూసినవారు కూడా ఈ సినిమాను ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారు. అలా అని ఒరిజినల్‌ సోల్‌కు ఏ మాత్రం తక్కువ ఉండదు. శ్రీకాంత్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో పని చేయటం చాలా ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు.

Spread the love